భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికా కాలిఫోర్నియాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road accident)లో ఇద్దరు యువతులు చనిపోయారు. గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి (24), ము ల్కనూరుకు చెందిన కడియాల భావన (24) ఉన్నత చదువుల కోసం మూడేండ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది ఫ్రెండ్స్ రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఇద్దరు ప్రయాణిస్తు న్న కారు అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడింది. దీంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మరిన్ని కథనాలు:
ఉన్నావ్ లైంగిక దాడి కేసు.. నిందితుడికి ‘నో’ బెయిల్