భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ మందాటి బుచ్చిరెడ్డి పదవీ విరమణ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హెచ్ఎం వీరన్న నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి-యమున దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రూపా రాణి, పిఆర్టియు మండల అధ్యక్షుడు సూరం భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తి, విద్యాదానం ఎంతో గొప్పవని కొనియాడారు.
గత 35 ఏళ్లుగా విద్యార్థుల భవిష్యత్తు కోసం బుచ్చిరెడ్డి అందించిన సేవలు అపూర్వమని వారు అభినందించారు. తన ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎంతోమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన బుచ్చిరెడ్డి విరమణ పట్ల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వరచారి, రేవతి, వైడూర్యం, సారంగపాణి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.