భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

కులవృత్తుల్లో స్వయంఉపాధి సాధించడం సమాజానికి ఆదర్శం

9f33a31e-6bdd-459a-8570-5f9d05c5e4a1

భారత్ సమాచార్, సంగారెడ్డి  జిల్లా: కుల వృత్తులను గౌరవించడం మన సంప్రదాయమని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో భాస్కర్ ఏర్పాటు చేసిన లాండ్రీ షాపును తాజా మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్‌తో కలిసి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంప్రదాయ కుల వృత్తుల్లో స్వయం ఉపాధి సాధించడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువకులను ఇలాంటి వృత్తుల వైపు ప్రోత్సహిస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాజేష్, సంజీవరెడ్డి, మొగులయ్య, హుస్సేన్, రామకృష్ణ రమేష్, వినోద్ పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, వాసుదేవరెడ్డి, సూర్యనారాయణ, ఆంజనేయులు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.