భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, జులై 2025, శనివారంభారత్ సమాచార్

అందరూ చూస్తుండగానే కత్తులు, రాడ్లతో కొట్టి చంపారు

nellore-murder-case (1)

భారత్ సమాచార్.నెట్, నెల్లూరు: వాటాల విషయంలో ముగ్గురు భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ హమీద్ అనే యువకుడిని అందరి ముందు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

కత్తులతో, రాడ్లతో కొట్టి చంపారు:

కొండాపురం మండలం గరిమినపెంటకు చెందిన హమీద్‌ను ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వాటాదారులు ఇనుపరాడ్లు, కత్తులతో కొట్టడంతో అక్కడికక్కడే హమీద్ మృతి చెందాడు. ఉదయగిరిలో హమీద్, హనీఫ్, ఉమర్ అనే ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్‌ను ఉమ్మడి భాగస్వామ్యంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ ఫంక్షన్ హాల్ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో పార్ట్‌నర్స్‌ మధ్య విభేదాలు తలెత్తడంతో హమీద్ తన వాటా లావాదేవీలు పూర్తిచేయకముందే ఇతరులు హాల్‌ను కొనసాగిస్తున్నారన్న అభిప్రాయంతో తాళాలు వేసి హాల్‌ను మూసివేశాడు. ఈ విషయంపై చర్చించేందుకు హనీఫ్, ఉమర్ ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో అక్కడ ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన హనీఫ్, ఉమర్.. అందరి సమక్షంలో రాడ్లు, కత్తులతో హమీద్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన హమీద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టూ ఉన్నవారు చూస్తున్నారే తప్ప ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.