భారత్ సమాచార్.నెట్, నెల్లూరు: వాటాల విషయంలో ముగ్గురు భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ హమీద్ అనే యువకుడిని అందరి ముందు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

కత్తులతో, రాడ్లతో కొట్టి చంపారు:

కొండాపురం మండలం గరిమినపెంటకు చెందిన హమీద్‌ను ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వాటాదారులు ఇనుపరాడ్లు, కత్తులతో కొట్టడంతో…