భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: డోంగ్లి మండలంలోని మాధన్ హిపర్గా గ్రామంలో శుక్రవారం రోజున గర్భిణీలకు, బాలింతలకు గ్రామ సర్పంచ్ బాచేవారు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల ఆహారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరవడుతోందని, దీంతో అనేక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాలు కలిగిన ఆహారం అందించడమే కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించేలా పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారాని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సరూబాయ్ గైక్వాడ్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఆశావర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
2, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్