భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దివంగత నందమూరి తారక రామారావు స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జనవరి 18, 19వ తేదీలలో కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా టీజీవి కళాక్షేత్రంలో నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కళారత్న పత్తి ఓబులయ్య, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత పి. హనుమంతరావు చౌదరి, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, వివి రమణాచారి, డీ పుల్లయ్య, డీ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. పోటీలో ఉభయ తెలుగు రాష్ట్రాల రంగస్థలం కళాకారులు పాల్గొనవచ్చు. పాల్గొన్న ప్రతి కళాకారునికి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు, మెమెంటోలు అందించబడతాయి. పోటీలో ప్రవేశ రుసుము లేదు. ఉత్సాహం ఉన్న కళాకారులు, మహిళా కళాకారులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
4, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్