భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దివంగత నందమూరి తారక రామారావు స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జనవరి 18, 19వ తేదీలలో కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా టీజీవి కళాక్షేత్రంలో నిర్వహించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కళారత్న పత్తి ఓబులయ్య, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత పి. హనుమంతరావు చౌదరి, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, వివి రమణాచారి, డీ పుల్లయ్య, డీ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. పోటీలో ఉభయ తెలుగు…