భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

కబడ్డీ జట్టుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రోత్సాహం

WhatsApp Image 2026-01-03 at 6.57.45 PM

భార‌త్ సమాచార్ నెట్, సంగారెడ్డి : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ కేంద్రంగా జనవరి 6వ తేదీ నుండి ప్రారంభంకానున్న ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్’ (SGF) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తెలంగాణ అండర్-14 కబడ్డీ జట్టుకు ఆయన అండగా నిలిచారు. ఈ క్రీడలకు వెళ్తున్న క్రీడాకారులకు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్ సూట్లను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుండే క్రీడల పట్ల యువతకు ఆసక్తి పెంపొందించేలా కృషి చేస్తున్నామని, జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, SGF జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సిఐలు వినాయక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.