భారత్ సమాచార్ నెట్, సంగారెడ్డి : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ కేంద్రంగా జనవరి 6వ తేదీ నుండి ప్రారంభంకానున్న ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్’ (SGF) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తెలంగాణ అండర్-14 కబడ్డీ జట్టుకు ఆయన అండగా నిలిచారు. ఈ క్రీడలకు వెళ్తున్న క్రీడాకారులకు తన సొంత నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్ సూట్లను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ…





