భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా తన ఐరీష్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్ (Sophie Shine)తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న శిఖర్ ధావన్.. ఆమెను మనువాడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఫిబ్రవరి మూడో వారంలో జరగనున్న ఈ వివాహానికి భారత క్రికెటర్లు, బాలీవుడ్ తారలు హాజరు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అయితే శిఖర్ ధావన్ పెళ్లిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. 2012లో అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్న ధావన్.. 2023లో ఆమెకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం కొన్నాళ్లకు దుబాయ్‌లో సోఫీ షైన్‌తో అయిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లు సహజీవనం చేసిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ సోఫీ షైన్..
హాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సోఫీ షైన్ వయసు 35 ఏళ్లు. ఆమె ఒక ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్. ప్రస్తుతం అబుదాబిలో పని చేస్తున్నారు. సోఫీ షైన్ లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరిన్న కథనాలు:
ఆమెనే భారత తదుపరి కెప్టెన్‌గా నియమించాలి..