భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, జులై 2025, గురువారంభారత్ సమాచార్

Telugu States: అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్..  ఆ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలకు అవార్డులు

35f31889-f2b0-4261-9f8e-a58f5634af9c
భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ అగ్రస్థానంలో నిలచింది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఎనిమిదోసారి ఈ అవార్డును సొంతం చేసుకుంది ఇండోర్. గుజరాత్‌లోని సూరత్ సిటీ రెండో స్థానంలో నిలవగా.. ముంబై మూడో స్థానం దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ సత్తా చాటుతూ.. నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల విజేతలను కేంద్రం ఇటీవల ప్రకటించించింది. తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవం వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ అవార్డులను అందజేశారు. ఇక జనాభా జాబితాలో నోయిడా నగరం తొలి స్థానంలో నిలవగా.. చండీగఢ్, మైసూర్ వరుసగా నిలిచాయి. ఇక క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు కేటగిరీలో తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ తొలిస్థానాన్ని దక్కించుకుంది. ఇకపోతే కేంద్రం ప్రకటించిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం జాతీయస్థాయిలో స్పెషల్‌ కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డు దక్కించుకోగా.. రాజమహేంద్రవరానికి రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్‌ అవార్డు లభించింది. స్వచ్ఛ సూపర్‌లీగ్‌ సిటీస్‌ విభాగంలో తిరుపతి, విజయవాడ, గుంటూరు ఎంపికయ్యాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ అందుకున్నారు.