భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ అగ్రస్థానంలో నిలచింది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఎనిమిదోసారి ఈ అవార్డును సొంతం చేసుకుంది ఇండోర్. గుజరాత్‌లోని సూరత్ సిటీ రెండో స్థానంలో నిలవగా.. ముంబై మూడో స్థానం దక్కించుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ సత్తా చాటుతూ.. నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల విజేతలను కేంద్రం ఇటీవల ప్రకటించించింది. తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన…