భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

దౌల్తాబాద్‌లో వీధి కుక్కల స్వైరవిహారం

WhatsApp Image 2026-01-08 at 5.31.38 PM

భార‌త్ సమాచార్ నెట్, సంగారెడ్డి జిల్లా : నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. గ్రామంలోని 10వ వార్డులో అబ్బో బాకర్ అనే చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా కుక్కల మంద బాలుడిపై దాడి చేశాయి. కుక్కలు కనికరం లేకుండా కరవడంతో బాలుడు తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. చిన్నారి అరుపులు విని కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేలోపే కుక్కలు బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి.

వెంటనే బాలుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు పెరిగిపోయాయని, చిన్నారులు, మహిళలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.