భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: నంద్యాల ఎంపీ

WhatsApp Image 2026-01-08 at 8.33.07 PM

భార‌త్ సమాచార్ నెట్, నంద్యాల : నందికొట్కూరులో ఆంధ్ర విద్యార్థి సంఘం, ఎన్ టైమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో “లీవ్ డ్రగ్స్–సేవ్ లైఫ్” నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత జీవితాలే కాకుండా, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.

నందికొట్కూరు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను, చట్టపరమైన చర్యలను వివరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.