భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపురారం గ్రామ సర్పంచ్ బైరం లక్ష్మి కృష్ణ హాజరై ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బైరం లక్ష్మీ కృష్ణ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అనగా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పవిత్రమైన సమయం, అందులోనూ పంటలు చేతికొచ్చిన ఆనందంతో రైతులు జరుపుకునే పండుగ ఇది అన్నారు. భోగి మంటలతో చలిని తరిమేసి, ఇంటి ముందు ముగ్గులు వేసి, బసవన్నను ఆహ్వానించే గంగిరెద్దులతో తమ సంప్రదాయాలు చాటుకుంటారు. ఇది ప్రకృతికి, సంపదకు కృతజ్ఞతలు చెప్పే సకుటుంబ పండుగ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రధానాచార్యులు కందిమల్ల దామోదర్ మాట్లాడుతూ.. సంక్రాతి పండుగ అనేది కొత్త ఆరంభాలకు సూచిక అని, ధనుర్మాసం ముగింపునకు, పుణ్యకాలానికి ప్రతీక అని సంక్రాంతి గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు మహేష్, వెంకట్, సైదులు, మొయినుద్దీన్, నాగరాజు, అనిల్, ఇంద్రారెడ్డి, మహిళా ఉపాధ్యాయులు కవిత, సరిత, క్రాంతి, మాధవి, జ్యోతి, అనంతలక్ష్మి, మానస, శివకుమారి, శ్రీలక్ష్మి, అనురాధలు పాల్గొన్నారు.