భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపురారం గ్రామ సర్పంచ్ బైరం లక్ష్మి కృష్ణ హాజరై ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బైరం లక్ష్మీ కృష్ణ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అనగా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పవిత్రమైన సమయం, అందులోనూ పంటలు చేతికొచ్చిన ఆనందంతో రైతులు జరుపుకునే పండుగ…