భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఐబీ వద్ద స్వామి వివేకానంద విగ్రహం వరకు విద్యార్థుల కళాకారుల ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కూన వేణు మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానందని ఆదర్శాలను అనుసరించి దేశసేవకు అంకితమవాలని పిలుపునిచ్చారు. అదే విధంగా మెట్టు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని, విద్య, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో ముందుకు సాగితే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని పేర్కొన్నారు. యువత తమ శక్తిని సృజనాత్మకంగా వినియోగించి రాష్ట్రం, దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూన వేణుతో పాటు టౌన్ సీఐ రమేష్, మెట్టు శ్రీధర్ యాదవ్, బాలు యాదవ్, రాయల్ కళాశాల డైరెక్టర్ కృపానిధి, మంద భాస్కర్ రెడ్డి, జగదీశ్వర్, సంయుక్త పాఠశాల ప్రతినిధి రామకృష్ణ, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు జుబేదా బేగం, ఆశన్న గౌడ్, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.