భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి: కుందేళ్ల అర్జున్

44da7984-0b4f-4273-bf92-5ebc8902b9ff

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి కొత్తకోట పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గ కాంటెస్టడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా ద్వారానే సమాజంలో విప్లవాత్మక మార్పు వస్తుందని, అలాంటి విద్యను యాదవులు నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. యాదవులు రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో రాణించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ ప్రజా ఆదరణను పొంది ఇంకా రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం చైర్మన్ పెండెం కురుమూర్తి యాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్య యాదవ్, మాజీ డీసీసీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాములు యాదవ్, పెబ్బేరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రె స్వామి యాదవ్, అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, గైనికాడి రాములు యాదవ్, నూతన సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.