భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జనవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

ఉత్తమ యువజన సంఘం అవార్డు అందుకున్న గుర్రాల సత్యనారాయణ

e69fc10b-d9c2-4be3-9100-626883d54b58

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపాలిటీలోని పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన చత్రపతి శివాజీ యువజన సంఘం సామాజిక కార్యక్రమాలతో గ్రామ అభివృద్ధి తోపాటు మహనీయుల జయంతి కార్యక్రమాల ద్వారా వారి స్ఫూర్తిని సమాజానికి పరిచయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర యువజన వారోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సామాజిక సేవలో ముందడుగులో ఉన్న యువతీ యువకులను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఏర్పుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి చేతుల మీదుగా చత్రపతి శివాజీ యువజన సంఘం అధ్యక్షులు గుర్రాలసత్యనారాయణకు రాష్ట్ర ఉత్తమ యువజన సంఘం అవార్డు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా శివాజీ యువజన సంఘం అధ్యక్షులు గుర్రాల సత్యనారాయణ మాట్లాడుతూ.. పెద్దమ్మగూడెం గ్రామంలో శివాజీ యువజన సంఘం ఏర్పాటు చేసుకొని సామాజిక కార్యక్రమాలు యోజన ఐక్యతతో సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో పెద్దమ్మగూడెం శివాజీ యువజన సంఘం తలపెడుతున్న కార్యక్రమాల్ని పరిశీలించి రాష్ట్ర యువజన సంఘాల సమితి ఈ అవార్డు ఇవ్వడం శివాజీ యువజన సంఘం సభ్యులుగా గర్వపడుతున్నామన్నారు. భవిష్యత్తులో యువజన సంఘాలతో కలిసి పనిచేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్ట సాధిస్తామని అన్నారు.