భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ఘణపురం మండలం మామిడిమాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని గ్రామ సభలో గ్రామస్తులు నిలదీయడంతో గ్రామసభ రసాభాసగా మారింది. అదే గ్రామానికి చెందిన వెంకట్ రావు ఒక్కరికే రెండు మూడు ప్లాట్ల ఇప్పించి కొంత మందితో మంచిగా నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేశారు. ఈ గ్రామంలో 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు రెండు ఎకరాల పొలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయంపై 2020లో జిల్లా కలెక్టర్, ఎమ్మార్వోకు దరఖాస్తు ఇవ్వడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూమిలో ఎస్సీలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు మహేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన భూమిలో ఇండ్ల నిర్మాణం కోసం అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో వెంకట్రావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కమిటీ సభ్యులుగా ఉండి మామిడిమాడ గ్రామానికి సంబంధించిన వారు కాకుండా పక్క గ్రామానికి సంబంధించిన వాళ్ల మనుషులకు ఒక్కొక్కరికి రెండు ఇండ్ల చొప్పున కేటాయించుకున్నారని ఆరోపించారు. వీరందరూ గతంలో లబ్ధిపొంది కూడా కూడా ఇందిరమ్మ ఇండ్లు పొందారని, సర్వే నెంబర్ 1లో లబ్ధిపొందిన వారికే అధికారులు మళ్లీ ఇండ్లు కేటాయించారన్నారు. ఈ స్థలంలో 40ఇండ్లకు పర్మిషన్ ఇచ్చి 24 ఇండ్లు మాత్రమే పూర్తి చేశారన్నారు. మళ్లీ తీసుకున్న వారికే కాకుండా డిప్ సిస్టం వేసి మిగిలిన 16 ప్లాట్ సరైన లబ్ధిదారులకి ఇచ్చే విధంగా చూడాలని అధికారులను వేడుకున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారి ఛైర్మన్గా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అతను సంతకం పెట్టలేదన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఇండ్లు, ప్లాట్లు కేటాయిస్తున్నారన్నారు.