భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

e52e94a3-192b-4ab5-8728-259243283613

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రెండు నెలల క్రితం పరిశ్రమలో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం అందించారు. బొల్లారం డివిజన్ పరిధిలోని రాణే డై కాస్టింగ్ పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కృష్ణ సింగ్ అనే కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికుడు మృతి చెందాడని.. మెరుగైన నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా పరిశ్రమ యాజమాన్యం రూ.20 లక్షల నష్టపరిహారం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారానికి సంబంధించిన రూ.15 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందజేశారు. మరో ఐదు లక్షల రూపాయలు అతి త్వరలో అందజేయనున్నట్లు యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. కార్మికుల సంక్షేమం ఆర్థిక అభ్యున్నతి లక్షంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సంజయ్ సింగ్, సునీల్ సింగ్, ప్రిన్స్, టీంకు, తదితరులు పాల్గొన్నారు.