భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రెండు నెలల క్రితం పరిశ్రమలో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి మెరుగైన నష్టపరిహారం అందించారు. బొల్లారం డివిజన్ పరిధిలోని రాణే డై కాస్టింగ్ పరిశ్రమలో రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో కృష్ణ సింగ్ అనే కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికుడు మృతి చెందాడని.. మెరుగైన నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…