భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

అమీన్‌పూర్‌లో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి

WhatsApp Image 2026-01-16 at 9.48.43 PM (1)

భార‌త్ సమాచార్ నెట్, సంగారెడ్డి జిల్లా : అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణి నగర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎన్. సత్యప్రసాద్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పందాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఈ దాడిలో పందాలు ఆడుతున్న 18 మంది వలస కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27 పందెం కోళ్లు, 9 మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లు, రూ. 8,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, కోళ్లను అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిర్వాహకుడితో పాటు పందెం రాయుళ్లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.