భార‌త్ సమాచార్ నెట్, సంగారెడ్డి జిల్లా : అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణి నగర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎన్. సత్యప్రసాద్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పందాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఈ దాడిలో పందాలు ఆడుతున్న 18 మంది వలస కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 27 పందెం కోళ్లు, 9 మొబైల్ ఫోన్లు, రెండు బైక్‌లు, రూ. 8,000 నగదును…