భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో భారీ బహిరంగ ధార్మిక సభ ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం, జమీయతే ఉలమాయే హింద్ అధ్యక్షులు అంజద్ బాషా సిద్ధికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు జరుగనున్న సభలో రాష్ట్ర మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్, హైదరాబాద్ ప్రముఖ ధార్మిక పండితులు మహమ్మద్ అమీర్, మహమ్మద్ అతిఖుర్ రహ్మన్ పాల్గొంటారు. జిల్లా ఇమాములు ప్రతి సంవత్సరం రంజాన్ ప్రారంభంలో ఇలాంటి ధార్మిక సభలు నిర్వహిస్తారని, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
BHARATH SAMACHAR DIGITAL
22, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్