భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

గీతం విద్యార్థుల సాంకేతిక మేధోమథనం

WhatsApp Image 2026-01-22 at 6.13.15 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సాంకేతికోత్సవం ‘ఎపోచ్ 4.0’ విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టింది. గిట్ హబ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, సైబర్ భద్రత, డాకర్ కంటైనరైజేషన్ వంటి ఆధునిక అంశాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు.

రెండో రోజు ఓపెన్ సోర్స్ డెవలప్‌మెంట్, కోడింగ్ ఛాలెంజ్‌లు నిర్వహించగా, చివరి రోజున ‘ప్రాంప్ట్-టు-పేజ్’ వర్క్‌షాప్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)పై అవగాహన కల్పించారు. విద్యార్థులు సరికొత్త ఏఐ పోకడలను తెలుసుకోవడంతో పాటు, వాస్తవ ప్రపంచ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిపై పట్టు సాధించారని నిర్వాహకులు తెలిపారు. అభ్యాసం, పోటీ, సహకారం కలగలిసిన ఈ వేదిక విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని గీతం యాజమాన్యం పేర్కొంది.