భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి : హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సాంకేతికోత్సవం ‘ఎపోచ్ 4.0’ విద్యార్థుల నైపుణ్యాలకు పదును పెట్టింది. గిట్ హబ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, సైబర్ భద్రత, డాకర్ కంటైనరైజేషన్ వంటి ఆధునిక అంశాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు.
రెండో రోజు ఓపెన్ సోర్స్ డెవలప్‌మెంట్, కోడింగ్ ఛాలెంజ్‌లు నిర్వహించగా, చివరి రోజున ‘ప్రాంప్ట్-టు-పేజ్’ వర్క్‌షాప్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)పై అవగాహన…





