భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: వసంత పంచమి అనేది యావత్ భారతదేశంలో సరస్వతి దేవికి పూజ చేస్తూ, విశేషంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం మాఘ శుద్ధ పంచమి రోజును వసంత పంచమి అంటారు. దీనిని మదన పంచమి అని కూడా అనవచ్చు. ఈ మాఘశుద్ధ పంచమి రోజునే సరస్వతీదేవి జన్మించారు. ఈ వసంత పంచమిని పురస్కరించుకొని మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారంలో ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచ్ చిత్రం శివమ్మ ఆధ్వర్యంలో అదే గ్రామానికి చెందిన బుర్రి శంకర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు బుర్రి జస్వంత్, చిలుక గణేష్, వెంకట్రామా దంపతుల కుమార్తె చిలుక పల్లవి లకు స్థానిక అంగన్వాడీ కేంద్రంలో అక్షరభ్యాసం చేయించారు. సర్పంచ్ శివమ్మ మాట్లాడుతూ.. పాఠశాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్త నవనీతకు సూచించారు. చిన్నారి పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి అక్షరాలు దిద్దించడం, వారితో ఆటలు ఆడిస్తూ వారిలో మానసిక ఉల్లాసాన్ని నింపాలని ఆమెకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
23, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్