భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

రాగడపలో విద్యుత్‌శాఖ ప్రజాబాట కార్యక్రమం

5ab9afd9-04e7-453f-b307-8c39d6c8b5be

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: నిరంతర విద్యుత్తు సరఫరా ఇవ్వడమే లక్ష్యంగా విద్యుత్తుశాఖ వారు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తూ నిరంతరం పలు గ్రామాలు పర్యటించి అక్కడ నెలకొన్న విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం రాగడప గ్రామంలో ప్రజాబాట నిర్వహించారు. త్రిపురారం మండలం విద్యుత్తుశాఖ సహాయక ఇంజనీరు బాలు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, హెచ్.జి ఫ్యూస్, ఎల్.టి ఫ్యూస్ లను, వదులుగా ఉన్న స్థంభాల వైర్లను సరిచేయడం, కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాగడప గ్రామ సర్పంచ్ షేక్ సఫియా బేగం, ఉప సర్పంచ్ కలకొండ వెంకటేశ్వర్లు, విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మెన్, రాగడప గ్రామపంచాయతీ సిబ్బంది కోటయ్య తదితరులు పాల్గొన్నారు.