భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో అరెస్టైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటకు వస్తే తిరుమలకు పాదయాత్ర చేస్తానని ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ జనవరి 19, 2026న షాద్నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది క్రిష్ణమ్మ, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహేష్ గౌడ్, నగర పార్టీ అధ్యక్షుడు కొరకంచ రవి కుమార్ తదితరులు పాదయాత్రకు మద్దతు తెలిపారు.