భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, జనవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

భారతినగర్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

e46fcb4d-f8b0-4952-988d-8714e838ef1d

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని HIG మాధవనగర్ కాలనీ, మాక్ సొసైటీ (కంపెనీ వెనుక భాగం) ప్రాంతాల్లో చేపట్టనున్న నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ. 15.50 లక్షల వ్యయంతో HIG మాధవ నగర్ కాలనీలో సీనియర్ సిటిజన్ల కోసం నిర్మించనున్న ఫస్ట్ ఫ్లోర్ భవనం నిర్మాణ పనులకు, రూ.26 లక్షల వ్యయంతో మాక్ సొసైటీ పార్క్ పునఃరుద్ధరణ (రినోవేషన్) పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, కాలనీవాసులకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపర్చేందుకు కృషి కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్, ఇంజినీరింగ్ విభాగం డీఈ వెంకట రమణ, ఏఈ శివ, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య, HIG అధ్యక్షులు శ్రీనివాస్, మాక్ సొసైటీ అధ్యక్షులు సలీమ్, డైరెక్టర్లు సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, బీఎన్.రెడ్డి, పాపయ్య, రామారావు, రామకృష్ణ గారు, పరమేష్ యాదవ్, భాస్కర్ ముదిరాజ్, పాటి సత్యనారాయణ, ప్రమోద్ గౌడ్, ఐలేష్ యాదవ్, కుమార్, కళ్యాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.