భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేసినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఈశ్వర్ తెలిపారు. ప్రెస్ క్లబ్ కోసం స్థలం ఇచ్చి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గతంలో జర్నలిస్టుల బృందం ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందిస్తూ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నానని అలాగే ప్రభుత్వ స్థలంలో సర్వే చేసి జర్నలిస్టులకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్ ను ఆదేశించారు. ఈ మేరకు తహసిల్దార్ పాండు నాయక్ సూచనలతో మంగళవారం డిప్యూటీ తహసిల్దార్ రాజేంద్రప్రసాద్, ఆర్ఐ గణేష్, సర్వేయర్ మన్యం లు కలిసి రైతు వేదిక పరిసరాల్లో సర్వే నంబర్ 824లో కొంత స్థలాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా లొకేషన్ మ్యాప్ తయారుచేసి తహసిల్దార్ కు నివేదించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం.ఈశ్వర్, జర్నలిస్టులు గోపాల్ చారి, శ్రీనివాస యాదవ్, చంద్రశేఖర రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శివకుమారాచారి, బుద్వేష్, సురేందర్ గౌడ్, అశోక్, నాగరాజు, రామ్ నరేష్, మన్యం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
28, జనవరి 2026, బుధవారంభారత్ సమాచార్