భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

d95ddf21-030b-441d-a3d4-5b54f78bc3ca

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సీఐటీయూ మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని హోసూరు సమీపంలోని వేర్ హౌస్ గోడౌన్ హమాలీల సమావేశంలో పిలుపునిచ్చారు. వేర్ హౌస్ హమాలీ వర్కర్స్ యూనియన్ మేస్త్రి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో, కార్మికులు, కర్షకులు, సంఘటిత, అసంఘటిత రంగ ఉద్యోగులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయన ప్రధాన డిమాండ్లలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, పాత కార్మిక చట్టాల పునరుద్ధరణ, అంగన్వాడీ, ఆశా, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మనెంట్‌ స్థిరీకరణ, రవాణా, హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, అసంఘటిత రంగ కార్మికుల జీవిత భద్రత, ప్రభుత్వ రంగంలో విశాఖ ఉక్కు పరిశ్రమ, కనీస వేతనం 26,000, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఆదాని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు పునరుద్ధరణ వంటి అంశాలు ఉన్నాయి. కార్యక్రమంలో వేర్ హౌస్ హమాలీలు సుంకన్న, నాగేంద్ర, వంశీ, టి.సహదేవుడు, ఎం.రాజు, హుసేని, మధు, మద్దిలేటి, వై.రమేష్, ఏ.అమాస్ తదితరులు పాల్గొన్నారు.