భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సీఐటీయూ మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను విజయవంతం చేయాలని హోసూరు సమీపంలోని వేర్ హౌస్ గోడౌన్ హమాలీల సమావేశంలో పిలుపునిచ్చారు. వేర్ హౌస్ హమాలీ వర్కర్స్ యూనియన్ మేస్త్రి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో, కార్మికులు, కర్షకులు, సంఘటిత, అసంఘటిత రంగ ఉద్యోగులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయన ప్రధాన డిమాండ్లలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, పాత కార్మిక చట్టాల పునరుద్ధరణ, అంగన్వాడీ,…