భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

కందుల కొనుగోళ్లను వేగవంతం చేయాలి: జేసీ నూరుల్ క్వామర్

434c7f73-fc24-4146-8c73-c9233fdccda6

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధరకు కందుల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ క్వామర్ అధికారులను ఆదేశించారు. బుధవారం తుగ్గలి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పత్తికొండ ఆర్డీఓ డా. భరత్ నాయక్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కందుల తేమ శాతం, నాణ్యత ప్రమాణాలపై డీసీఎంఎస్ పత్తికొండ బ్రాంచ్ మేనేజర్ మురళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి కాటా వేసి సేకరించిన సరుకును వెంటనే గోడౌన్లకు తరలించాలని మేనేజర్‌కు సూచించారు. మండలంలో ఇప్పటివరకు 2,500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మండల వ్యవసాయాధికారి సురేష్ బాబు తెలిపారు. ఇప్పటికే 3,150 క్వింటాళ్ల కందులు సేకరించినట్లు మేనేజర్ మురళి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి, వ్యవసాయ సిబ్బంది, పలువురు రైతులు పాల్గొన్నారు.