భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: జి. భీమిరెడ్డి

WhatsApp Image 2026-01-28 at 7.47.18 PM

భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : వైసీపీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రాలయం మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు చెట్నేహళ్లి గ్రామంలో బుధవారం గ్రామ కమిటీల నియామక ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలని, 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, ఉత్సాహవంతులైన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.