భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, జనవరి 2026, గురువారంభారత్ సమాచార్

హెల్మెట్‌తోనే ప్రాణభద్రత: కలెక్టర్ సిరి

acc693e1-c1ed-4818-aa16-d505507863ad

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజ్ విహార్ సెంటర్ వరకు కొనసాగి అక్కడ ముగిసింది. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో భద్రతపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వారు కోరారు.