భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజ్ విహార్ సెంటర్ వరకు కొనసాగి అక్కడ ముగిసింది. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల్లో భద్రతపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని…