భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: పలమనేరు పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీతో అందిస్తున్న ఈ సైకిల్ లను పలమనేరు పురపాలక సంఘం సంబంధించి మహిళా సమైక్య సభ్యులు నమోదు కాబడిన 250మంది ఈ సైకిల్ లబ్ధిదారుల స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎంట్రీ కార్యక్రమం నందుకు కుప్పం నందు హాజరుకావలెను. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రూ. 36వేలు విలువ గల ఈ సైకిల్ లను సబ్సిడీపై రూ.24 వేలకే అందిస్తుందని ఈఎంఐ సౌకర్యం కూడా కలదని తెలిపారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్య దృష్ట్యా ప్రతిఒక్కరూ ఈ సైకిల్ లను వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. కుప్పంలో గురువారం ఏకకాలంలో5555 ఈ సైకిల్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గిన్నిస్ రికార్డును సృష్టించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మోహిద్దీన్, ప్రజా ప్రతినిధులు గిరి, కౌన్సిలర్ కిరణ్, బీఆర్సి కుమార్, పట్టణ అధ్యక్షులు కుట్టి, ఏరియా ఆసుపత్రి ఛైర్మన్ నాగరాజ్, భాస్కర్ యాదవ్, సీఎంఎం బాబా, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
30, జనవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్