భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

ఏదుల గ్రామంలో NSS శీతకాల శిబిరం

Screenshot 2026-01-30 185015

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కోఎడ్యుకేషన్ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 2, 4 ఆధ్వర్యంలో వనపర్తి మండలం ఏదుల గ్రామంలో ఏడు రోజులపాటు ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏదుల గ్రామ సర్పంచ్ పరుశరాముడు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏదుల ఎంపీడీవో రఘు రాములు, కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్ హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ ఎన్ఎస్ఎస్ విద్యార్థి, వనపర్తి నియోజకవర్గ కంటెస్టడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ శిబిరం ద్వారా విద్యార్థి దశలో సేవా భావాన్ని పెంపొందించడానికి, విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలుగుతుందన్నారు. యువత తలుచుకుంటే ఈ దేశ తలరాత మారుతుందని, అది ఎన్ఎస్ఎస్ ద్వారా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఏదుల గ్రామంలో ఎన్ఎస్ఎస్ సేవలు చాలా అవసరమని పూర్వ విద్యార్ధిగా చాలా గర్వంగా ఉందన్నారు.

 

గ్రామ సర్పంచ్ పరుశరాముడు మాట్లాడుతూ.. ఏదుల గ్రామంలో పనిచేసి, వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజల్లో మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై, బహిరంగ మలవిసర్జన, వివిధ రకాల సీజనల్ వ్యాధులు, ఇంకుడు గుంతల ఆవశ్యకత, గ్రామ సమగ్ర సర్వే లాంటి అంశాలపై అవగాహన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి యాదగిరి, పంచాయతీ సెక్రెటరీ రంగస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, జిల్లా పరిషత్ పాఠశాల పిటి రాజేందర్, కె.రమేష్ యాదవ్, ప్రోగ్రాం ఆఫీసర్స్, ఏదుల గ్రామ వార్డు మెంబర్లు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.