భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

మాటూరు పాఠశాలలో నోట్ బుక్స్ పంపిణీ

1

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా:  త్రిపురారం మండలం మాటూరు గ్రామంలో స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల  1994 – 1999 బ్యాచ్ పూర్వపు విద్యార్థులు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. పాఠశాలకు మైక్, సౌండ్ సిస్టమ్ అందించారు. మరొక పూర్వపు విద్యార్థి గ్రామస్థులు ఇచ్చిన 43,000 రూపాయల ఆర్థిక సహాయంతో నోట్ పుస్తకాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బులతో పాఠశాలలో ప్రత్యేకంగా నియమించిన ట్యూటర్ కు నెలనెలా జీతం ఇచ్చి, వారిచే పిల్లలకు బోధన చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాటూరు గ్రామ సర్పంచ్ వెంకట్రాం నాయక్, మాజీ సర్పంచ్ పాండు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, విద్యాకమిటీ మాజీ ఛైర్మన్ ధానావత్ రతన్ నాయక్, డీలర్ రాములు నాయక్, 1104 అదనపు కార్యదర్శి మోతీలాల్ నాయక్, కంప్యూటర్ ఆపరేటర్ కలకొండ శివకృష్ణ, గ్రామస్థులు కలకొండ శివశంకర మల్లయ్య, ధానావత్ చంటి, బెజవాడ యాదగిరి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.