భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్

50వ రోజుకు చేరిన రిలే దీక్షలు

ef85de0d-a1a9-42fc-be72-831fe97d6245

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో ఆలూరు జేఏసీ దీక్షలను కొనసాగిస్తోంది. శుక్రవారం రిలే దీక్ష 50వ రోజుకు చేరింది. కత్తి రామాంజనేయులు, ఎల్లప్ప, పూల రామాంజనేయులు దీక్షలలో పాల్గొన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వీరు ఆదోని ప్రాంతం విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలంటే జిల్లా స్థాయి హామీ అవసరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం 5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షను పరిగణించాలి అని పిలుపునిచ్చారు. 45వ రోజు దీక్షను ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో మరకట్టు గ్రామ మాజీ సర్పంచ్ ఎల్లప్ప నేతృత్వంలో రైతులు చేపట్టారు. వివిధ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వాన్ని ఆకాంక్షను పరిగణించమని కోరారు. ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకుని ఆదోని జిల్లా గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.