భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం సీపీఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, ఈ విషయంలో పార్టీ కట్టుబడి ఉందని సీపీఐ పట్టణ కార్యదర్శి టీ. వీరేష్ స్పష్టం చేశారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న దీక్ష 76వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదోని జిల్లా సాధనకు సంఘీభావంగా సీపీఐ అనుబంధ సంఘం మహిళా సమాఖ్య (NFIW) న్యూ గాంధీనగర్ శాఖ నాయకులు టి. రాజమ్మ, కె. పుష్పమ్మ, పాపమ్మ, ఎ. మునెమ్మ, ఎస్. సత్య, టి. శ్వేత, ఎ. జయమ్మ, కె. సరోజమ్మ, బి. అల్లమ్మ, జి. కమలమ్మలు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, సీపీఐ పట్టణ కార్యదర్శి టీ. వీరేష్, మండల కార్యదర్శి కల్లుబావి రాజు, న్యూ గాంధీనగర్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు లక్ష్మీనారాయణ, రమేష్ కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు
BHARATH SAMACHAR DIGITAL
31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్