భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, ఫిబ్రవరి 2026, సోమవారంభారత్ సమాచార్

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా: జంగిడి సరితా రవి యాదవ్

79390ff1-ca72-4e78-93af-b2d825944100

భారత్ సమాచార్, ​వనపర్తి జిల్లా: మున్సిపల్ ఎన్నికల వేళ వనపర్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 27వ వార్డు (సాయి నగర్ కాలనీ) కౌన్సిలర్ అభ్యర్థిగా విద్యావంతురాలు, నిరంతరం ప్రజాసేవలో ఉండే జంగిడి సరితా రవి యాదవ్ బరిలోకి దిగారు. ​ఎంపికలో ప్రజాభిప్రాయమే ప్రాతిపదిక గత కొన్నేళ్లుగా వార్డులోని సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న సరితా రవి పనితీరును గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వీరినే బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయినగర్ కాలనీ వంటి విద్యావంతులు ఉన్న ప్రాంతంలో, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బరిలోకి దింపడం ద్వారా విజయం తథ్యమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

​

వార్డు కోసం ప్రధాన లక్ష్యాలు:
​సాయినగర్ కాలనీ సమగ్ర అభివృద్ధి: వార్డులోని డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం, అంతర్గత రోడ్ల నిర్మాణం.

​మౌలిక సదుపాయాలు: నిరంతర మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి.

​పచ్చదనం – పరిశుభ్రత: వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేలా పార్కుల అభివృద్ధి మరియు పారిశుధ్య నిర్వహణ.

​”తనపై నమ్మకంతో 27వ వార్డు బాధ్యతను అప్పగించిన ప్రజలకు కృతజ్ఞతలు. సాయినగర్ కాలనీ అభివృద్ధి కోసం, మీ బిడ్డగా, మీ ప్రతినిధిగా అహర్నిశలు కృషి చేస్తానని జంగిడి సరితా రవి యాదవ్ హామీ ఇచ్చారు”

–