భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

రోబోటిక్ పోటీలలో మదర్ తెరిస్సా విద్యార్థుల ప్రతిభ

2

భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: చెన్నై విట్ విశ్వవిద్యాలయం నందు నిర్వహించబడిన ఏడవ అంతర్జాతీయ స్థాయి పలమనేరు లోని రోబోటిక్ పోటీలలో మదర్ తెరిసా పాఠశాల తరపున ఆరుగురు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 8వ తరగతి విభాగం నుండి డి. ప్రణితి ప్రధమ బహుమతి ఆర్. సతీష్ రెడ్డి ద్వితీయ బహుమతులు ఎస్. చరణ్, కె చరణ్ కుమార్ తృతీయ బహుమతులు, ఏడవ తరగతి విభాగం నుండిసి. జయశ్రీ ఎం సాయి వీక్షిత రెడ్డి తృతీయ బహుమతులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ రవీంద్రబాబు విద్యార్థులను అభినందిస్తూ రాబోయే కాలంలో మరిన్ని బహుమతులు గెలవాలని ప్రోత్సహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ డేవిడ్, బర్క్ మన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…. భవిష్యత్తు తరాలలో తమ పాఠశాల టెక్నాలజీ శాస్త్ర రంగంలో విద్యార్థులను ఉత్తముగా తీర్చిదిద్దే విధంగా తమ పాఠశాల అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు.