భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: నల్గొండ పట్టణంలో మునుగోడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బొటిక తిరుపతయ్య, అనసూయ దంపతుల కుమారుడు బొటిక మధు కుమార్ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం, కామర్స్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. “ఎంపిక చేసిన భారతీయ బ్యాంకు ఆర్థిక ఆరోగ్య విశ్లేషణ” అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం ఆచార్య కమటం శ్రీనివాస్ పర్యవేక్షణలో పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. జన్మతః శ్రవణ లోపం ఉన్న మధు కుమార్ ఎన్నో అడ్డంకులను అధిగమించి ఉన్నత విద్యలో ఈ ఘనత సాధించడం విశేషం. ఆయన తల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తుండగా, తండ్రి ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నారు. ఓ వైపు వైకల్యం మరో వైపు పేదరికం అయినప్పటికీ ఆయన కృషి, పట్టుదల తల్లితండ్రుల సహకారంతో ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి అసాధారణ విజయాన్ని అందుకోవడం అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది. డాక్టరేట్ పొందిన మధు కుమార్‌ను కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు, మిత్రులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.