భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ఎన్ఎస్ఎస్ యూనిట్ 2, 4 ఆధ్వర్యంలో శీతాకాల శిబిరం ఐదవ రోజులో భాగంగా ఏదుల మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కుందేళ్ళ అర్జున్ యాదవ్, గ్రామ సర్పంచ్ పరశురాముడు, ఉప సర్పంచ్ శేశి రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధాంసింగ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో కలిసి గ్రామంలోని ప్రధాన రహదారి రోడ్లను శుభ్రపరిచారు. కుందేళ్ళ అర్జున్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు చెత్త చెదారంతో వుంటే ప్రజలు రోగాల బారినపడే అవకాశం వుందని తెలిపారు. తదనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఏదుల గ్రామంలోని మెయిన్ రోడ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రం చేయడమే కాకుండా స్వచ్ఛభారత్ -శ్రమదానం పాటించి, గ్రామంలోని మెయిన్ రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ళకంపలు తొలగించారు, చెత్తను తీసి పరిసరాలను పరిశుభ్రం చేసినట్లు కుందేళ్ళ అర్జున్ యాదవ్, గ్రామ సర్పంచ్ పరుశురాం యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. రాఘవేంద్ర, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్లు, రమేష్ యాదవ్, సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
4, ఫిబ్రవరి 2026, బుధవారంభారత్ సమాచార్