భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, ఫిబ్రవరి 2026, గురువారంభారత్ సమాచార్

త్రిపురారం ఇందిరమ్మ కాలనీకి విద్యుత్ నిలిపివేత

ab52b191-f441-4e87-a4f3-dd5f3d4a5360

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: విద్యుత్తు మరమ్మతుల కారణంగా పలు గ్రామాలలో కరెంటు కోతలు జరుగుతుండడం సర్వ సాధారణం. దీనిలో భాగంగా నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం (సబ్ స్టేషన్)లో 11కేవీ త్రిపురారం టౌన్ ఫీడర్ యల్.టి లైనుకు 06 ఫిబ్రవరి 2026, శుక్రవారం నాడు విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో 11కేవీ త్రిపురారం టౌన్ ఫీడర్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతానికి ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకూ విద్యుత్తు సరఫరా నిలిపివేయబడుతుంది. కావున శుక్రవారం నాడు నిలిపివేయబడుతున్న సమాచారాన్ని ముందస్తుగానే తెలుపుతూ గృహ, వాణిజ్య, వ్యవసాయ మరియు పరిశ్రమలు తదితర వినియోగదారులు విద్యుత్తు సిబ్బందికి మరియు అధికారులకు సహకరించాలని త్రిపురారం మండల విద్యుత్ సహాయక ఇంజనీరు ఏ. బాలు నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు.