భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, ఫిబ్రవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు

9762a7ab-3375-47ca-a6bf-dc4d2a077cd9

భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: చదువుకో తెలంగాణ అనే కార్యక్రమం నిర్వాహణ చేపట్టిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని చదువుపై మరింత శ్రద్ధ పెట్టేలా ప్రోత్సాహించి, వారి లక్ష్యాలను సాధించే దిశగా మార్గనిర్దేశం చేసే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలలో అత్యున్నత మార్కులు సాధించి మొదటి స్థానాన్ని పొందిన వారికి 5 లక్షల రూపాయలు, రెండవ స్థానాన్ని పొందిన వారికి 3 లక్షల రూపాయలు, ప్రతీ జిల్లాలో మెదటిస్థానం పొందిన వారికి 2 లక్షల రూపాయలను నగదు బహుమానంగా ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రములో వున్న 119 నియోజకవర్గాలలో ప్రతీ నియోజకవర్గంలోని మొదటిస్థానం పొందిన విద్యార్థికి 1 లక్ష రూపాయలు, 612 మండలాలలో ప్రథమస్థానం పొందిన ప్రతీ విద్యార్థికి 10,000 రూపాయలు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఒక ప్రకటన ఇచ్చారు.

 

 

ఈ విషయంపై నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు పాఠశాలలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు అవగాహన సదస్సులను నిర్వహించారు. మండలంలోని చెన్నాయపాలెం పాఠశాలను సందర్శించిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, దామరచర్ల శాఖ మేనేజరు మడుపు నాగరాజు మాట్లాడుతూ.. ఈ మహత్తర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను పొంది, బహుమతులను అందుకోవాలని ఆయా పాఠశాల 10 వ తరగతి విద్యార్థులను కోరారు. ఈ పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలలో చదువుతూ, మార్చి 2026 పరీక్షలు వ్రాసే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది అని ఈ సందర్భంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డీవో మానస రమేశ్, ధానావత్ పాండు, ధానావత్ శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు నరసింహా స్వామి, మాలోతు లక్ష్మి, సత్యనారాయణ, ఝాన్సీ, శ్రీనివాస్, దశరథ నాయక్, మడుపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.